అదో మారుమూల ఏజెన్సీ ప్రాంతం.. అక్కడకు స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పా, కేంద్ర, రాష్ట్ర పెద్దలు కానీ, ఇతర సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రముఖులు కానీ ఉండరు. అలాంటి ఏజెన్సీ ప్రాంతానికి సడన్‌గా ప్రత్యేక భద్రతతో కూడిన ఒక అతిపెద్ద కాన్వాయ్ సైరన్స్ మోగిస్తూ రయ్యిరయ్యిన వెళ్తుంది. అలా వెళ్తున్న కాన్వాయ్‌ని ఆ ఏరియాలో స్థానికులు ఎప్పుడూ చూడలేదు.
అదో మారుమూల ఏజెన్సీ ప్రాంతం.. అక్కడకు స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పా, కేంద్ర, రాష్ట్ర పెద్దలు కానీ, ఇతర సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రముఖులు కానీ ఉండరు. అలాంటి ఏజెన్సీ ప్రాంతానికి సడన్‌గా ప్రత్యేక భద్రతతో కూడిన ఒక అతిపెద్ద కాన్వాయ్ సైరన్స్ మోగిస్తూ రయ్యిరయ్యిన వెళ్తుంది. అలా వెళ్తున్న కాన్వాయ్‌ని ఆ ఏరియాలో స్థానికులు ఎప్పుడూ చూడలేదు. అసలు అంత హడావుడిగా తమ ప్రాంతానికి వచ్చిన ఆ కాన్వాయ్ ఎవరిదా? ఆ కాన్వాయ్ లో ఎవరున్నారు? ఎందుకు వచ్చారు? రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే వారం రోజులు ముందుగానే మైకుల్లో ఉదరగొడతారు కదా? ఇలా సడిచప్పుడు లేకుండా వస్తున్నారేంది? అని అంతా ఆలోచనలో పడ్డారు.
ఇంతలో ఆ కాన్వాయ్ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లి ఒక మధ్యతరగతి వ్యక్తుల ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అయితే అలా వచ్చింది ఎవరా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతలో సింపుల్ సిటీగా ముతక చీరలో ఉన్న ఓ మహిళ కారులో నుండి క్రిందకు దిగింది. ఆమె దిగేవరకు ఎవరు వచ్చారో ఎవరికీ తెలియదు. ఆ తరువాత కారులో నుండి దిగిన మహిళను చూసి స్థానికులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అయ్యింది. ఆ కారులో నుండి దిగింది ఎవరో కాదు సాక్షాత్తు దేశ ఆర్థిక వ్యవస్థను ఒంటి చేత్తో నడుపుతున్న ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
ఆప్రోటోకాల్ లో భాగంగా సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం రాజన్నదొరతో పాటు, జిల్లా కలెక్టర్, ఎస్‌పీ, జిల్లా యంత్రాంగం అంతా క్షణాల్లో అక్కడకు చేరుకుంది. అంత హడావుడిని చూసిన స్థానికులు నిర్మలా సీతారామన్ ఇంత సింపుల్ సిటీగా ఇక్కడకు రావడమేంటి? ఇలా ఒక మధ్యతరగతి కుటుంబానికి దేశంలో అతిపెద్ద స్థానంలో ఉన్న నిర్మలా సీతారామన్ ఎందుకు వచ్చింది? అని ఆరా తీయడం ప్రారంభించారు స్థానికులు. దీంతో ఏళ్ల తరువాడి ఇక్కడ నివసిసున్నా వాళ్లకి ఎప్పుడూ తెలియని నిజాలు తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.
నిర్మలా సీతారామన్ స్వయానా ఆమె భర్త పరకాల ప్రభాకర్ తమ్ముడు అయిన పరకాల సుధాకర్ ఇంటికి వచ్చారని తెలిసుకున్నారు స్థానికులు. ఇటీవల సీతారామన్ అత్త, భర్త పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంభ అనారోగ్యంతో మృతి చెందారు కాళికాంబ మరణించే వరకు పరకాల ప్రభాకర్ సోదరుడు పరకాల సుధాకర్ వద్దే ఉండేది. కాళికాంబ అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందడంతో సంప్రదాయం ప్రకారం పరకాల సుధాకర్ సొంత ఇంటి వద్ద సాలూరులో కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పెద్దకోడలిగా ఉన్న నిర్మలా సీతారామన్ తన అత్త కాళికాంబకు జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేంద్రమంత్రి సీతారామన్ వచ్చే వరకు సీతారామన్ అత్త, వారి కుటుంబసభ్యులు సాలూరులో ఉన్నా ఏళ్లు గడుస్తున్నా స్థానికులెవరికి ఆ విషయం తెలియదు. సీతారామన్ ఎంత సింపుల్ గా ఉంటుందో ఆమె మరిది, తోటికోడలు కూడా అంతే సింపుల్‌గా ఉంటారు. అందువల్ల వారు పరకాల ప్రభాకర్ సోదరుడు అని కానీ, నిర్మలా సీతారామన్ మరిది సుధాకర్ అని కానీ ఎవరికి తెలియదట. నిర్మలా సీతారామన్ తోటికొడలు కూడా ఒక మండల స్థాయి ప్రభుత్వ అధికారి. ఎప్పుడు, ఎక్కడ కూడా తాను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తోటికోడలని చెప్పి హుందాతనాన్ని ప్రదర్శించరని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కనీసం తెలిసిన వారు సీతారామన్ తోడుకొడలు అని పరిచయం చేసినా అలా పరిచయం చేయొద్దని చెప్పేంత సింపుల్ సిటీ సీతారామన్ తోటికోడలు వ్యక్తిత్వం అనే చెప్పాలి. ఏది ఏమైనా నిర్మలా సీతారామన్ సడన్ గా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..