సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం, పల్లె బాట పట్టింది. సెలవులు ప్రారంభమైన క్రమంలో ప్రజలంతా గ్రామాలకు పయణమవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిన క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు…
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నం, పల్లె బాట పట్టింది. సెలవులు ప్రారంభమైన క్రమంలో ప్రజలంతా గ్రామాలకు పయణమవుతున్నారు. దీంతో బస్సులు, రైళ్లు అన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిన క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ట్రెయిన్ నెంబర్ 07489 సోమవారం 20.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి, మంగళవారం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు జనవరి 15వ తేదీన స్టార్ట్ అవుతుంది.
* తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు (07490) ట్రైన్ మంగళవారం 16.35కి తిరుపతి నుంచి బయలుదేరి, బుధవారం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జనవరి 16వ తేదీ ఈ రైలు బయలుదేరుతుంది.
* సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు వెళ్లే 07066 నెంబర్ రైలు బుధవారం 19.00 గంటలకు బయలుదేరి, గురువారం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. జనవరి 17వ తేదీన ఈ ట్రైన్ జర్నీ ప్రారంభమవుతుంది.
* కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే 07067 రైలు గురువారం 21.00 గంటలకు బయలు దేరి, శుక్రవారం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జనవరి 18వ తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.
* నర్సాపూర్ – సికింద్రాబాద్‌ల మధ్య నడిచే 07251 నెంబర్ ట్రైన్ బుధవారం 18 గంటలకు బయలుదేరి, గురువారం 4.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 17వ తేదీన బయలుదేరుతుంది.
* సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్లే 07252 నెంబర్ ట్రైన్ గురువారం 23.30 గంటలకు బయలుదేరి శుక్రవారం 8.35 గంటలకు చేరుకుంటుంది. జనవరి 18వ తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.
* సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్.. కాచిగూడు, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహమూబ్‌నగర్, వనరపర్తి, గద్వాల్, కర్నూల్, ఢోన్, గూటీ, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్స్‌లో ఆగుతుంది.
* సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు.. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, కైకలూరు, భీమవారం టౌన్, తనకు, నిడదవోలు, రాజమండ్రి, సామల్‌కోట్ స్టేషన్స్‌లో ఆగుతుంది.
* నర్సాపూర్ – సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ప్రత్యేక రైలు.. పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాల్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్స్‌లో ఆగుతుంది.
* సికింద్రాబాద్ – నర్సపూర్ ప్రత్యేక రైళ్లు.. జనగాన్, కాజిపేట, వరంగల్, మహమూబాబాద్, ఖమ్మం, మదిరా, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్స్‌లో ఆగుతుంది.