టెంపుల్ సిటీ తిరుపతిలో వైసీపీ వర్సెస్ జనసేన మద్య పోటీపై చాలెంజ్ వార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి పవన్ కల్యాణ్‌ను పోటీకి పెడితే బంపర్ మెజారిటీ తమదేనంటోంది వైసీపీ. జనసేనానే కాదు ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమంటోంది జనసేన. అయితే ఇప్పటికే దూకుడు పెంచిన వైసీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లగా టీడీపీతో జత కట్టిన జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న క్లారిటీ మాత్రం లేకపోతోంది.
టెంపుల్ సిటీ తిరుపతిలో వైసీపీ వర్సెస్ జనసేన మద్య పోటీపై చాలెంజ్ వార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి పవన్ కల్యాణ్‌ను పోటీకి పెడితే బంపర్ మెజారిటీ తమదేనంటోంది వైసీపీ. జనసేనానే కాదు ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా వైసీపీ ఇంటికి పోవడం ఖాయమంటోంది జనసేన. అయితే ఇప్పటికే దూకుడు పెంచిన వైసీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లగా టీడీపీతో జత కట్టిన జనసేన పోటీ చేస్తుందా లేదా అన్న క్లారిటీ మాత్రం లేకపోతోంది. వైసీపీ మాత్రం పవన్ కల్యాణ్ పోటీ చేయాలని కోరుతుండటంతో ఆధ్యాత్మిక నగరంలో రెండు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ ప్రారంభమైంది.
తిరుపతి.. ఆధ్యాత్మిక నగరంగానే కాదు రాజకీయంగా కూడా గుర్తింపు ఉన్న అసెంబ్లీ. ఎన్టీఆర్, మెగాస్టార్ అసెంబ్లీకి పంపిన తిరుపతిలో.. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులపై పొలిటికల్ పార్టీలో డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రత్యేకించి వైసీపీ జనసేన మద్య పోటీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా తిరుపతి నుంచి జనసేన పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం కేడర్‌లో విస్తృత ప్రచారమే సాగుతోంది.
అయితే ఇప్పటివరకు టీడీపీ బరిలో ఉంటుందా లేక జనసేన పోటీ చేస్తుందా అన్న దానిపై క్లారిటీ లేకపోయినా జనసేన మాత్రం తిరుపతి అసెంబ్లీని పట్టుపట్టే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ తిరుపతిని సెంటిమెంట్‌గా భావించి పార్టీ అధినేతగా చిరంజీవినే బరిలో దింపింది. అప్పటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవిని బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే తిరుపతి అక్కున చేర్చుకుంది. ఈ సెంటిమెంట్‌ను తిరిగి తెరమీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న జనసేన, అన్న పోటీ చేసిన చోటే తమ్ముడు కూడా బరిలో ఉంటారని భావిస్తోంది. అయితే ఇప్పటివరకు జనసేన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తిరుపతి బరిలో ఉండేది టీడీపీనా లేక జనసేననా అన్న క్లారిటీ కూడా లేకపోతోంది.
అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం తిరుపతి సమన్వయకర్తను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కొడుకుకు పట్టం కట్టింది. ఇప్పటికే వైసీపీ విడుదల చేసిన రెండో జాబితాలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఉన్న భూమన అభినయ్‌ను సమన్వయకర్తగా ప్రకటించింది. దీంతో దూకుడు పెంచిన భూమన అభినయ్ పోలింగ్ బూత్‌ల వారీగా సమావేశాలతో బిజీ అయ్యారు. తిరుపతి అభివృద్ధి, జగన్ సర్కార్ సంక్షేమం గెలిపిస్తుందన్న ధీమాతో ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిన వైసీపీ టెంపుల్ సిటీ తిరిగి తమదేనంటోంది. జతకట్టిన విపక్షం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తే ఇంకా బాగుంటుందని చెబుతోంది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి పోటీ చేసి గెలిచి మూడేళ్లుగా ఏమీ చేయకపోవడం తమకు కలిసొచ్చే అంశం అంటోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తే గెలిపించడం ద్వారా తిరుపతి అభివృద్ధికి ఒరిగేది ఏమీ లేదని ఇక్కడి ప్రజలకు తెలుసంటున్న వైసీపీ గెలుపు మరింత సులువు అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు భూమన అభినయ్ పవన్ కల్యాణ్ పోటీ చేయాలంటున్నారు ఆయన.
ఇక పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీ చేయాలని వైసీపీ డిమాండ్ చేయడాన్ని జనసేన సిల్లీగా తీసుకుంటోంది. పవన్ తో పోటీ పడే దమ్ముందా అని ప్రశ్నిస్తోంది. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా వైసీపీకి ఓటమి తప్పదంటోంది. ఇక, జనసేనాని అయితే భారీ మెజార్టీ ఉంటుందని చెబుతోంది. వైసీపీకి ఓటమి తప్పదంటోందంటున్నారు జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్.
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ విడుదల కాలేదు. కానీ పొలిటికల్ పార్టీలు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. చూడాలి మరీ టెంపుల్ సిటీ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో…!