Redmi Note 13 Series చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ నోట్ 13 5G సిరీస్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. కొత్త సంవత్సరంలో ఆ కంపెనీ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. మన దేశం కంటే ముందే చైనాలో ఈ సిరీస్ ఫోన్లు మూడు వేరియంట్లలో అందుబాటులోకొచ్చాయి. వీటిలో రెడ్‌మీ నోట్ 13 5G, రెడ్‌మీ నోట్ 13 ప్రో 5G, రెడ్‌మీ నోట్ 13ప్రో+5G అనే వేరియంట్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా ఈ ఫోన్లో ఉన్న ఫీచర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
రెడ్‌మీ నోట్ 13 5G సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 13 5G వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. నోట్ 13ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ల మోడల్స్ 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, 120hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటాయి. రెండు హ్యాండ్ సెట్లకు 4nm చిప్‌సెట్ లభిస్తుంది. దీని ప్రాసెసర్ Snapdragon 7s Gen 2గా ఉంటుంది. నోట్ 13 ప్రో ప్లస్‌లో మీడియాటెల్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఉంది. నోట్ 13లో MediaTek Dimensity 6080 చిప్ సెట్ ఉంది. ఈ ఫోన్లలో డాల్బీ అట్మాస్, 1800 నిట్ ల వకు బ్రైట్ నెస్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 120W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.
వీటిలో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ సిరీస్‌లో Android 14 OS అందుబాటులో ఉంటుంది. Redmi Note 13 Pro Plus 200 మెగా పిక్సెల్(ప్రైమరీ కెమెరా), 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మైక్రో సెన్సార్లను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలో HDR, Dual LED ఫ్లాష్ సపోర్ట్‌తో 16 మెగా పిక్సెల్స్‌తో వస్తుంది.