యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పర్వదినాన అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పేరుని ‘ది రాజా సాబ్’గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేసింది. ‘ఎక్స్’ వేదికగా ఫస్ట్ లుక్‌ను పంచుకున్న డైరెక్టర్ మారుతీ ‘బహుశా ఈ ఏడాది సంక్రాంతే నాకు బెస్ట్’ అని వ్యాఖ్యానించాడు.
‘‘ ఆఫీషియల్‌గా మీ అందరికీ ‘ది రాజా సాబ్’ను ప్రజెంట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశాం. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. డార్లింగ్ ప్రభాస్‌ని ఎలా చూడాలనుకున్నారో అలా చూడబోతున్నారు.. అందుకు నాది ప్రామిస్’’ అని మారుతీ రాసుకొచ్చారు. నల్లరంగు చొక్కా, నిక్కరుపై లుంగీ కట్టుకొని ప్రభాస్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో ఈ ఫస్ట్ లుక్‌ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పిక్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్ నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాప్ ట్రెండింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
‘ ది రాజా సాబ్’ సినిమా హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ మధ్యే విడుదలైన సలార్ మూవీ విజయం సాధించడం, ‘కల్కీ’ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించడంతో ఖుషీలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్ మరింత ఆనందాన్ని ఇచ్చింది.