11.1 C
Delhi
Monday, December 23, 2024

Advertsie Now

spot_img

అయోధ్యకు బయల్దేరుతూ అభిమానులను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

అయోధ్యలో రేపు (జనవరి 22) రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లకు కూడా ఆహ్వానం అందింది. ఈ సాయంత్రం చిరంజీవి, రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి అయోధ్యకు బయల్దేరేముందు అభిమానులను కలిశారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసి చిరంజీవి, రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు చిరంజీవి, రామ్ చరణ్ లకు శ్రీరామ ప్రతిమను బహూకరించారు. పలువురు అభిమానులు రక్తదానం కూడా చేశారు.

అంతకుముందు, చిరంజీవి తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఆ దేవుడు పంపిన ఆహ్వానంగా భావిస్తానని తెలిపారు. “ఆ అంజనాదేవి పుత్రుడు ‘చిరంజీవి’ హనుమంతుడు… భువిపై ఉన్న ఈ అంజనాదేవి పుత్రుడు చిరంజీవికి పంపిన ఆహ్వానం” అంటూ అభివర్ణించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles