16.1 C
Delhi
Monday, December 23, 2024

Advertsie Now

spot_img

కోడి కత్తి శ్రీనుకు బెయిల్ ఇవ్వండి.. ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్

మరోవైపు కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. విజయవాడలో సావిత్రమ్మ, సుబ్బరాజు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఆసుపత్రిలో కూడా వైద్యానికి నిరాకరించి దీక్షను కొనసాగించారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు వచ్చి మాట్లాడారు. న్యాయపోరాటం చేద్దామని, దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో ఆదివారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ తదితరులు సావిత్రమ్మ, సుబ్బరాజులకు ఓఆర్‌ఎస్‌ ఇచ్చి దీక్ష విరమింపజేయించారు. శ్రీను దాదాపు ఐదేళ్లగా జైలులో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు దళితులంటే ముఖ్యమంత్రికి ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 24న దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్‌ కోర్టులో సాక్ష్యం చెప్పి.. తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి, సోదరుడు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles