- అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం
- హాజరైన పవన్ కల్యాణ్
- అయోధ్యకు విచ్చేసిన చిన్నజీయర్ స్వామి
పురాణ విశిష్టత కలిగిన నగరం అయోధ్యలో ఒక మహా సంరంభం ముగిసింది. జగదభిరాముడు నేడు బాలరాముడి అవతారంలో అయోధ్యలో కొలువుదీరాడు. నేడు నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు విచ్చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం మేరకు అయోధ్య వచ్చి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అయోధ్యకు విచ్చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిని కలిశారు. ఇరువురూ కాసేపు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. పవన్, చిన్నజీయర్ స్వామి మాట్లాడుకుంటున్న సమయంలో ‘మై హోమ్’ రామేశ్వరరావు అక్కడే ఉన్నారు.