- 2023 ఏడాదికి గానూ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా కోహ్లీ
- గతంలో ఈ అవార్డు మూడు సార్లు అందుకున్న కోహ్లీ
- కోహ్లీ ఖాతాలో 10కి పెరిగిన ఐసీసీ అవార్డుల సంఖ్య
- 10 ఐసీసీ అవార్డులు ఖాతాలో వేసుకున్న తొలి ఆటగాడు కోహ్లీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీకి అవార్డులు కొత్త కాదు. కింగ్ కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు జాలువారడం ఎంత సాధారణమో, అవార్డులు వెతుక్కుంటూ రావడం కూడా అంతే సాధారణం.
తాజాగా, కోహ్లీ ఖాతాలో మరో ఐసీపీ అవార్డు చేరింది. 2023 ఏడాదికి గాను కోహ్లీ ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. ఈ పురస్కారం కోహ్లీని వరించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో కోహ్లీ 2012, 2017, 2018లో ఐసీసీ మేటి వన్డే ఆటగాడిగా నిలిచాడు.
తాజా అవార్డుతో కలిపి కోహ్లీ ఖాతాలోని ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి పెరిగింది. ఐసీసీ నుంచి ఇన్ని అవార్డులు అందుకున్న ఆటగాడు కోహ్లీనే. ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లో ఎవరూ లేరు.
కోహ్లీ తర్వాత శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార్ సంగక్కర, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ చెరో 4 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నారు.