18.1 C
Delhi
Monday, December 23, 2024

Advertsie Now

spot_img

Anupama Parameshwaran: పట్టుచీర కట్టులో పంచదార బొమ్మలా అనుపమ .. లేటెస్ట్ పిక్స్!

 

  • అందమైన అల్లరి పేరే అనుపమ
  • ‘ప్రేమమ్’తో మొదలైన ప్రయాణం
  • కుదురైన రూపమే ప్రత్యేక ఆకర్షణ
  • మూడు భాషల్లో వరుస అవకాశాలు
Anupama Parameshwaran Special

అనుపమ పరమేశ్వరన్ ..  కుదురైన రూపం .. కుందనపు బొమ్మలాంటి లావణ్యం ఆమె సొంతం. ‘ప్రేమమ్’ మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన ప్రయాణం ఆపకుండా ఆమె ముందుకు వెళుతూనే ఉంది. ఒకవైపున తెలుగు సినిమాలు చేస్తూనే, మరో వైపున తమిళ .. మలయాళ భాషల్లో గ్యాప్ రాకుండా చూసుకుంటోంది. అనుపమ మోడ్రన్ డ్రెస్సుల్లోను .. సంప్రదాయ బద్ధమైన చీరకట్టులోను అందంగా కనిపిస్తుంది .. అరవిందంలా వికసిస్తుంది. అందువల్లనే ఈ రెండు తరహా పాత్రలను ఆమెకి ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా పట్టుచీరకట్టులోని ఆమె పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కుర్రాళ్ల హార్ట్ వాల్స్ పై పోస్టర్లుగా వెలుస్తున్నాయి. వరుసగా అనుపమ ఇచ్చిన ఈ స్టిల్స్ చూస్తే, అందం .. అల్లరి ఒక్కచోటునే ఉన్నట్టుగా అనిపిస్తోంది కదూ. ఆకర్షణీయమైన రూపంతో .. మనసులు కొల్లగొట్టే కోలకళ్లతో తన అభిమానులుగా మార్చేసుకుంటోంది. ఆమె నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఈగల్’ .. ‘టిల్లు స్క్వైర్’ రెడీ అవుతున్నాయి. ఈ సౌందర్య శిల్పానికి సక్సెస్ కూడా తోడవుతుందేమో చూడాలి మరి.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles