- అభిమన్యుడ్ని కాదు అర్జునుడ్ని అంటూ ఇటీవల సీఎం వ్యాఖ్యలు
- పురాణ పురుషుల గురించి ఎందుకులే జగన్ అంటూ గంటా వ్యంగ్యం
- అర్జునుడు ధర్మాన్ని గెలిపించినవాడని స్పష్టీకరణ
ఇటీవల భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పద్మవ్యూహంలోకి దూకడానికి నేను అభిమన్యుడ్ని కాదు… ఇక్కడ ఉన్నది అర్జునుడు అంటూ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యంగా స్పందించారు.
నీకున్న అజ్ఞానానికి పురాణ పురుషుల గురించి మాట్లాడడం ఎందుకులే జగన్ అంటూ ఎత్తిపొడిచారు. “అర్జునుడు అంటే నీలాగా రాక్షసుడేమో అనుకుంటున్నట్టున్నావు! కాదు కాదు… ఆయన ధర్మం వైపు నిలబడి యుద్ధం చేసినవాడు… ధర్మాన్ని గెలిపించిన వాడు” అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
అంతేకాదు, వైసీపీ పాలన తీరు ఇలా ఉంది అంటూ సీఎం జగన్ ను విమర్శిస్తూ ఓ వీడియోను కూడా పంచుకున్నారు.