X Audio And Video Calling Features : సోషల్ మీడియాలో Twitter X (ట్విట్టర్) గురించి తెలియని వారుండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్లో గత కొన్ని రోజులుగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) తన యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. యూజర్లు తమ ‘ఎక్స్’ యాప్‌ను అప్ డేట్ చేసుకోడం ఈ ఫీచర్‌ను పొందవచ్చు. అయితే.. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎక్స్’ యూజర్లు ఈ ఫీచర్ వినియోగం కోసం తమ యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘ప్రైవసీ అండ్ సేఫ్టీ’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అటుపై డైరెక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఎంచుకుంటే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ‘మిమ్మల్ని అనుసరిస్తున్న వారు, మీరు అనుసరిస్తున్న వారు, వెరిఫైడ్ యూజర్లు’ అనే ఆప్షన్లలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
అయితే.. ఎలాన్ మస్క్ ట్విట్టర్ (Twitter)ను కొనుగోలు చేసిన నాటి నుంచి అనేక మార్పులు, కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొదట ‘ఎక్స్’ పేరుగా మార్చారు. అనంతరం ఎన్నోమంచి, సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూజర్లకు సరికొత్త ఎ్స్‌పీరియన్స్‌ను అందించే దిశగా.. కేవలం ట్వీట్స్ మాత్రమే మాత్రమే కాకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.