- చిరంజీవిని వరించిన పద్మభూషణ్
- పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాథక్ లకు కూడా పద్మవిభూషణ్
- వీళ్లు చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదన్న ఆర్జీవీ
ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. తాజాగా ఆయన పద్మ విభూషణ్ అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితరులను పద్మ విభూషణ్ పురస్కారాలు వరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… పద్మ విభూషణ్ పురస్కారాలపై పెదవి విరిచారు. పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాథక్ వంటి వాళ్ల గురించి తాను ఎప్పుడూ వినలేదని… వాళ్లు మెగాస్టార్ చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదని అన్నారు. ఒకవేళ చిరంజీవి గారు ఈ విషయంలో సంతోషంగా ఉంటే… తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తానని చెప్పారు. వర్మ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.