14.1 C
Delhi
Monday, December 23, 2024

Advertsie Now

spot_img

Galla Jayadev: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: గల్లా జయదేవ్

  • వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
  • ఇకపై బిజినెస్ పైనే పూర్తిగా దృష్టిసారించనున్నట్లు వెల్లడి
  • గుంటూరు ప్రజలకు ఆత్మీయ విందు ఇచ్చిన టీడీపీ నేత
Guntur MP Galla Jayadev Quits Politics

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేత జయదేవ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండుసార్లు ఎంపీగా గెలిచి, ప్రస్తుతం ఎంపీగా గుంటూరు ప్రజలకు ఆయన సేవలందిస్తున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడే గల్లా జయదేవ్.. తన తల్లి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు సేవచేశారు. ఆయనకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీనటుడు కృష్ణ పెద్దల్లుడు, హీరో మహేశ్ బాబుకు గల్లా జయదేవ్ స్వయానా బావగారు. మహేశ్ బాబు సోదరి భర్త. ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొందినా గల్లా జయదేవ్.. ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles