చదువుకుంటే జ్థానంతో పాటు ఆయుష్షూ పెరుగుతుందని ప్రతిష్ఠాత్మక లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం చెబుతోంది. పాఠశాల లేదా కాలేజీలో గడిపిన ప్రతి ఏడాదీ ఆయుష్షు పెరుగుతున్నట్లు తెల్చింది. నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులతోపాటు మరికొందరు నిపుణుల బృందం జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. చదువుకునే సమయంలో ఏటా 2శాతం మరణ ముప్పు తగ్గుతుందని వివరించింది.