- మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి
- 801 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 215 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
నిన్న భారీ లాభాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అదే స్థాయిలో నష్టపోయాయి. కేంద్ర తాత్కాలిక బడ్జెట్, గురువారం నాడు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 801 పాయింట్లు కోల్పోయి 71,139కి పడిపోయింది. నిఫ్టీ 215 పాయింట్లు నష్టపోయి 21,522కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.59%), టెక్ మహీంద్రా (0.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.14%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-5.17%), టైటాన్ (-3.13%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.08%), ఎన్టీపీసీ (-2.83%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.81%).